పుష్పలో సిస్టర్ గా యంగ్ హీరోయిన్ ?

megha akash

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్, బన్నీకి సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఇంతకీ ఆ సిస్టర్ రోల్ కి సంబంధించి ఒక ఎమోషనల్ ట్రాక్ ఉంటుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని, ఆ పాత్రకు మేఘా ఆకాష్ పాత్రకు మధ్య ట్రాక్ ఉంటుందని.. ఆమె చావుకి పోలీస్ నే కారణం అవుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

Exit mobile version