బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక కార్యక్రమం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జెమిని టీవీ లో ఈ కార్యక్రమం ఆగస్ట్ 22 వ తేదీన ప్రారంభం కానుంది. వస్తున్న, ప్రతీ ఇంటికి వచ్చేస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ మరొక సరికొత్త ప్రోమో తో మన ముందుకి వచ్చేశారు. ఆగస్ట్ 23 నుండి రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది అని వ్యాఖ్యానించారు.
సోమవారం నుండి గురువారం వరకూ ప్రసారం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండటం తో ఈ షో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక రామ్ చరణ్ ఈ కార్యక్రమం కి తొలి గెస్ట్ గా వస్తుండటం తో టీఆర్పీ కూడా భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
