సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై తాజా సమాచారం!


కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తీవ్రంగా గాయపడ్డారు. మరియు హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అతనికి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది మరియు నిన్న ఆపరేషన్ జరిగింది.

ఆసుపత్రి నుండి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై తాజా సమాచారం ఏమిటంటే, అతను ICU లో ఉన్నారు. సాయి తేజ్ ను ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. అంతేకాక త్వరలో వేంటిలేటర్ ను కూడా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కి సంబంధించి కుటుంబ సభ్యులు వివరాలను అడిగి తెలుసు కుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ అయినప్పటి నుండి అభిమానులు, ఆత్మీయులు అంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకుని రావాలి అంటూ కోరుకుంటున్నారు.

Exit mobile version