ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మాస్ చిత్రం “అఖండ” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా గ్యాప్ ఉన్న సమయంలో బాలయ్య ఓటిటి యాప్ “ఆహా” లో “అన్ స్టాప్పబుల్” అనే ఇంట్రెస్టింగ్ టాక్ షో ని చేసి అందులోనీ సూపర్ హిట్ కొట్టారు.
మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ షో నుంచి రెండు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కు రాగా నెక్స్ట్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈసారి ఎపిసోడ్ బాలయ్య మరియు మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ల మధ్య ఉండబోతుందట. ఈ సౌండింగ్ నే వేరే లెవెల్లో ఉంది.
ఇక ఈ ఎపిసోడ్ ఇంకెంత ఎనర్జిటిక్ గా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఈ షోలో ఎపిసోడ్ ఒకదాన్ని మించి ఒకటి ఇంకో లెవెల్లో ఉంటున్నాయని చెప్పాలి.