న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికీ”. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి మరో అప్డేట్ వచ్చింది. “రంగో రంగ” అనే లిరికల్ సాంగ్‌ను మే 23న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.