ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి అవైటెడ్ గా ఉన్నటువంటి చిత్రాల్లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ మరియు యంగ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగ్ రాజ్ ల కాంబోలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా తెరకెక్కనుండగా దీనిపై అయితే లేటెస్ట్ గా లోకేష్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మరి తాను లేటెస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాపై ఓ ప్రాపర్ అప్డేట్ అయితే ఈ ఏడాది డిసెంబర్ లో వస్తుందని తెలిపాడు. అలాగే సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ నుంచే స్టార్ట్ కానున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని అయితే లోకేష్ ఓ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాలా ప్లాన్ చేస్తుండగా మాస్టర్ తర్వాత మళ్ళీ ఈ కాంబో సెట్ కావడంతో అభిమానుల్లో చాలా అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.