పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరిగుతూ ఉండగా మేకర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుండడంతో అన్ని పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా నుంచి టీజర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరచగా ఇప్పుడు సినిమా అవైటెడ్ ట్రైలర్ కట్ కి సంబంధించి సాలిడ్ బజ్ వినిపిస్తోంది.
దీని ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ ఈ ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ దిశా పటాని తదితరులు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ మే 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
