ఫోటో మూమెంట్ : MLCగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు చిరంజీవి అభినందనలు

chiru ag

జనసేన పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC)గా కొణిదెల నాగబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయనకు జనసేన పార్టీ నేతులతో పాటు ఇతర రాజకీయ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా నాగబాబు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖలను కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబును మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు. ఆయకు గిఫ్ట్‌గా ఓ ఖరీదైన పెన్‌ను చిరు బహూకరించారు. ఇక సురేఖ కూడా నాగబాబుకి అభినందనలు తెలిపారు.

దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version