తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో గర్వించదగ్గ అతికొద్ది మంది సీనియర్ హీరోస్ లో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒకరు. మరి నేడు మే 31న ఆయన జయంతి సందర్భంగా ఘట్టమనేని అభిమానులకి పలు ట్రీట్ లు కూడా వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా రీరిలీజ్ థియేటర్స్ లో సందడి చేస్తుండగా ఇదే ఊపులో అతడు రీరిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
మరి ఇది కూడా కృష్ణ గారి జయంతి కానుకే కాగా లేటెస్ట్ గా ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో ఇదే స్పెషల్ రోజున తన కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాడు. మరి ఆ యువ హీరోనే ఘట్టమనేని జయకృష్ణ. ఛార్మింగ్ లుక్స్ తో పరిచయం అవుతున్న ఈ యువ నటుడు ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో తెరంగేట్రం చేస్తున్నాడు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారి స్ఫూర్తితో రాబోతున్నాడు. మరి ఆ బ్యానర్, ప్రముఖ దర్శకుడు ఎవరు ఏంటి అనే వివరాలు ముందు తెలియనున్నాయి.
