నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “ది ప్యారడైజ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి రేపు రెండు బిగ్ అప్డేట్స్ వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు అప్డేట్స్ ఏంటి అనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
ఉదయం 10 గంటల 5 నిమిషాలకి వచ్చే ట్రీట్ నా ఊహకి నాని ఎలా మారారు? సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి వచ్చే అప్డేట్ తన యాటిట్యూడ్ మా ప్రామిస్ అంటూ రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. సో ఈ డబుల్ ధమాకా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
TOMORROW | Two Posters.
10:05 AM – how I imagined. How he transformed.
5:05 PM – His attitude and our promise.
With your love and with our madness.
We are going all in with #THEPARADISENote: From now on, every character will be introduced through two posters.
— Srikanth Odela (@odela_srikanth) August 7, 2025
