“పెళ్లిలో పెళ్లి” టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ – త్వరలో థియేటర్లలోకి!

Tanikella-Bharani

సుఖకర్త ఫిలింస్, గౌరీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యువ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహించగా, గణేష్ కోలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ, “ఈ సినిమా ఈవెంట్ జరుగుతుండగా బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఇది పరమేశ్వరుడి ఆశీర్వాదంలా అనిపిస్తోంది. ‘సుఖకర్త’ అనే బ్యానర్ పేరుకు తగ్గట్టే ఈ సినిమా అందరికీ సుఖాన్ని అందించాలి. గణేష్ కోలి లాంటి అభిరుచి గల నిర్మాతలు విజయం సాధిస్తే, మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. దర్శకుడు శ్రీకాంత్ సంబరం షోలాపూర్‌లో కూడా చాలా వేగంగా సినిమాను పూర్తి చేశారు, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది,” అని ప్రశంసించారు.

హీరో శివ సాయిరిషి మాట్లాడుతూ, “నిర్మాత గణేష్, దర్శకుడు శ్రీకాంత్ ఎంతో సహకరించారు. ఈ టీమ్ అంతా ఒక కుటుంబంలా మారింది,” అని కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత గణేష్ కోలి మాట్లాడుతూ, “తెలుగు సినిమాలపై ఉన్న అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ కథలో ట్విస్ట్ ఏంటో నాకు కూడా తెలియదు, మీతో పాటే థియేటర్లలో చూస్తాను,” అని ఆసక్తిని రేకెత్తించారు.

దర్శకుడు శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ, “షోలాపూర్‌కు వెళ్లి తెలుగు సినిమా తీసిన మొదటి టీమ్ మేమే. భరణి గారు మా సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇది మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ, ప్రేక్షకులకూ ఆ ఎమోషన్ చేరుతుందని నమ్ముతున్నాం,” అని అన్నారు.

యువ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, “ఇది పోస్టర్ లాంఛ్ లా కాకుండా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్‌గా ఉంది. యువ టీమ్‌కు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు అభినందనలు. టైటిల్, ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి,” అని శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version