పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం “గబ్బర్ సింగ్ ” మూడువారాల షెడ్యూల్ పూర్తయ్యింది . గత కొన్ని రోజులుగా ఈ చిత్రం పొల్లాచ్చి లో షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ మరియు శ్రుతి హాసన్ ల మధ్య కీలక సన్నివేశాలు మరియు పాటలను చిత్రీకరించారు. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో పని చేయటంతో కాస్త ధీమాగా ఉన్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత పవర్ స్టార్ ఎనర్జీ గురించి సినిమా లో ఎంటర్ టైన్ మెంట్ మోతాదు గురించి చెప్పకనే చెప్పాడు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారం తెర మీదకి రాబోతుందని అంచనా.