మీసాల పిల్ల తర్వాత రెండో పాట వినిపించేది అప్పుడే?

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మంచి బజ్ లో ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ మీసాల పిల్ల ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం మేకర్స్ ఈ సాంగ్ ని రానున్న నవంబర్ చివరి వారంలో విడుదల చేయాలని చూస్తున్నారట. ఇక ఈసారి సాంగ్ కూడా మంచి డ్యూయెట్ నే అని వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా వెంకీ మామ కూడా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version