మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఇంకా ఫ్యామిలీ ఆడియెన్స్ మంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అభిమానుల్లో మంచి సస్పెన్స్ గా ఉంది.
సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన ఈ సినిమా డేట్ ని మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని పెట్టి అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమాని గ్రాండ్ గా ఈ జనవరి 12 నా విడుదల చేస్తున్నట్టు సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. సో మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ ఎంట్రీ ఆరోజు ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ కూడా సాలిడ్ రోల్ చేశారు. అలాగే భీమ్స్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.
