ఆది సాయి కుమార్ ‘శంబాల’ నుంచి మనసుని హత్తుకునే ‘పదే పదే’ సాంగ్ విడుదల

Shambala 2

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా, యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘పదే పదే’ అనే ఎమోషనల్ పాటను మేకర్స్ విడుదల చేశారు.

హీరో కుటుంబ బంధాన్ని, వారి మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరించేలా ఈ గీతం సాగుతుంది. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యానికి, శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా, యామిని ఘంటసాల ఆలపించారు. ‘ముగ్గురైనా ఒక్కటేగా’ అంటూ సాగే ఈ పాట కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉందని చిత్ర బృందం తెలిపింది.

అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కాగా, సినిమా విడుదలకు ముందే అన్ని హక్కులు అమ్ముడై టేబుల్ ప్రాఫిట్ సాధించిందని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన రావడంతో సినిమా విజయంపై యూనిట్ ధీమాగా ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version