చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. గతంలో బాలకృష్ణ ఇదే టైటిల్‌తో చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రిజల్ట్ రాబడుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ అంశాలతో నింపేశారు. శర్వానంద్ ఔట్ అండ్ ఔట్ ఫన్ ప్యా్క్‌తో అందించే ఎంటర్టైన్మెంట్ ఈ టీజర్‌కే హైలైట్. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో శర్వా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా సంయుక్త, సాక్షి వైద్య నటిస్తుండగా వారు కూడా తమదైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
వెన్నెల కిషోర్, సత్య, నరేష్ తదితరులు కూడా ఈ ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్‌లో తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
