భారతీయ యానిమేషన్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టేలా రూపొందిన చిత్రం ‘మిషన్ సాంటా’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో కూడా ఈ సినిమా సందడి చేయనుంది.
లాస్ ఏంజిల్స్‌లో కథ, స్క్రిప్ట్, పాత్రల రూపకల్పన జరుపుకున్న ఈ చిత్రానికి.. పూర్తి స్థాయి యానిమేషన్ పనులను భారత్‌లోనే నిర్వహించారు. దాదాపు 20 నెలల పాటు 150కి పైగా భారతీయ నిపుణులు శ్రమించి ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దారు. బ్రాడ్‌విజన్ ఇండియా, స్టూడియో 56 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. భారతీయ యానిమేషన్ రంగాన్ని కేవలం సేవల స్థాయికే పరిమితం చేయకుండా.. క్రియేటివ్, వాణిజ్యపరంగా గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ హై-ఎనర్జీ అడ్వెంచర్ చిత్రం.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ సాహసాలతో కూడిన ఈ ఇంగ్లీష్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని పంచనుంది.
