పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘మారుతి నేనూ కలిసి హారర్ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు, కేవలం తమన్ ఒక్కడే న్యాయం చేయగలడు అనుకున్నాం. తనలా ఆర్ఆర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాలో మరొకరు లేరు’ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ఇంకా మాట్లాడుతూ.. ‘మారుతి మూడు సంవత్సరాలు కష్టం ఈ సినిమా. ఎంతో ఒత్తిడి, పెయిన్, బాధ్యత.. అన్నీ కలిసి వచ్చాయి. ‘సినిమాలన్నీ డిష్యుం డిష్యుం అవుతున్నాయి.. సీరియస్ అయిపోతోంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి డార్లింగ్’ అని మారుతితో చెప్పాను. ఎన్నో ట్రై చేశాం.. ఫైనల్ గా హారర్ కామెడీ సెట్ అయింది’ అని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నట్టు ప్రభాస్ స్పీచ్ మధ్యలో ”బాహుబలి జయహో” అంటూ ఫ్యాన్స్ అరిశారు. ‘నా స్పీచ్ బోరింగ్ గా ఉంటుందని బాహుబలి జయహో అంటున్నారు కదా” అని ప్రభాస్ సరదాగా అన్నారు.
