గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు సినిమా ఛాన్సులకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర గట్టిగా హిట్ కొట్టి చాలా కాలమైంది. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ ముద్దుగుమ్మలకు ఇప్పుడు సరైన ‘బ్రేక్’ దొరకడం లేదు. ఎన్ని అవకాశాలు వస్తున్నా, తమ క్రేజ్‌ను మళ్లీ టాప్కు తీసుకెళ్లే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఈ ఇద్దరు భామలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆశలన్నీ ఇప్పుడు విజయ్ ‘జన నాయగన్’ సినిమాపైనే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన తమిళ సినిమాలు నిరాశపరిచినా, దళపతి చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఈ సినిమాలో పూజా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా తన యాక్టింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయాల్సి ఉంది. అప్పుడే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ జోరందుకుంటుంది.
మరోవైపు శ్రీలీల ‘పరాశక్తి’తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సినిమా టీజర్లు, సాంగ్స్‌లో శ్రీలీల ఎనర్జీ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. కేవలం డ్యాన్సులే కాదు, తనలోని నటిని కూడా ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకోవాలని ఆమె తహతహలాడుతోంది. పోటీ పెరిగిపోతున్న కోలీవుడ్ రేసులో నిలవాలంటే, ఈ పండుగ సీజన్లో ఈ ఇద్దరు భామలకు గెలుపు అనేది ‘డూ ఆర్ డై’ లాంటిదే!
