2025 గూగుల్ సెర్చ్‌లో దుమ్ములేపిన టాప్ 10 సినిమాలు ఇవే..!

2025

2025 సంవత్సరం ముగిసింది. కొత్త ఆశలతో, ఆశయాలతో 2026లోకి అడుగుపెట్టాం. అయితే, 2025లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. అయితే, వాటిలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కొన్ని మెప్పించలేకపోయాయి. మరికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక 2025లో ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో ప్రేక్షకులు ఏయే సినిమాలను ఎక్కువ సెర్చ్ చేశారనే విషయంపై ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఓ లిస్ట్ రెడీ చేసింది.

2025 సంవత్సరంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్-10 చిత్రాలకు సంబంధించి గూగుల్ ఓ జాబితా రిలీజ్ చేసింది. మరి ఈ 2025లో ఏ సినిమాలను నెటిజన్లు ఎక్కువగా వెతికారో ఇక్కడ చూద్దాం.

బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుండి వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సైయారా’ కోసం అత్యధికంగా సెర్చ్‌ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను మోహిత్ సూరి డైరెక్ట్ చేశారు.

ఇక టాప్ 2వ స్థానంలో రిషబ్ శెట్టి నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార – ది చాప్టర్ వన్’ నిలిచింది. తొలి భాగంపై నెలకొన్న క్రేజ్, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా ఈ సినిమా రావడంతో ఈ సినిమా టాప్-2 ప్లేస్ సొంతం చేసుకుంది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం టాప్-3వ స్థానాన్ని దక్కించుకుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వార్-2’ ఈ జాబితాలో టాప్ 4వ స్థానంలో నిలిచింది.

ఇక బాలీవుడ్‌లో తెరకెక్కిన మరో రొమాంటిక్ చిత్రం ‘సనమ్ తేరి కసమ్’ టాప్-5వ స్థానంలో నిలిచింది. హర్షవర్ధన్ రాణె, మావ్రా హొకేన్ జంటగా నటించారు.

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’ ఈ జాబితాలో 6వ స్థానం దక్కించుకుంది.

బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ ‘హౌజ్‌ఫుల్’లో వచ్చిన 5వ భాగం ‘హౌజ్‌ఫుల్ 5’ టాప్ 6వ ప్లేస్‌లో నిలిచింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

బాలీవుడ్‌లో రూపొందిన ‘మిసెస్’(Mrs) చిత్రం ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

ఇక కన్నడలో తెరకెక్కిన డివోషనల్ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ 2025లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన 10వ చిత్రంగా నిలిచింది.

ఇలా అన్ని పరిశ్రమలకు సంబంధించిన సినిమాలను నెటిజన్లు గూగుల్ సెర్చ్‌లో వెతికారు. మరి మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

Exit mobile version