మహేష్ సృష్టించిన విధ్వంసం.. ‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజుల వరకు షేర్

Sarileru-Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక్క సరైన సినిమా పడితే దాని తాలూకా లాంగ్ రన్ ఏ లెవెల్లో ఉంటుందో పలు సినిమాలు చూపించాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సింపుల్ కంటెంట్ సినిమాలు కూడా మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీ ఆడియెన్స్ లో గట్టిగా పుల్ చేసిన హిస్టరీ ఉంది. అలా మహేష్ బాబు చేసిన ఇటీవల సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేసిన భారీ హిట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”(Sarileru Neekevvaru) కూడా ఒకటి.

కోవిడ్ కి ముందు భారీ క్లాష్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ రన్ ని కంప్లీట్ చేసుకొని మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా సృష్టించిన విధ్వంసంపై నిర్మాత ఓ షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశారు. ఈ సినిమాకి కంటిన్యూస్ గా 50 రోజుల పాటు షేర్ తోనే రన్ అయ్యిందట. అంటే 50 రోజుల లాంగ్ రన్ వరకు ఈ సినిమా ఎలాంటి డ్రాప్స్ లేకుండా రన్ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అనీల్ సుంకర నిర్మాణం వహించారు.

Exit mobile version