వరల్డ్ వైడ్ ‘రాజా సాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

The Raja Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ అలాగే రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”(The Raja Saab). మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది.

అయితే ఈ సినిమా ఈ మొదటి వారం 238 కోట్ల గ్రాస్ ని అందుకుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి సంక్రాంతి బరిలో రన్ ఈ టాక్ తో కూడా కలిసి వచ్చింది అనే చెప్పాలి. మరి ఈ సినిమాలో జరీనా వహబ్, సత్య, విటివి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version