‘ఓజి’ దెబ్బతో ‘ఉస్తాద్’ ఓటీటీ మారిందా?

OG

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్గ్ హిట్ చిత్రం ఓజి కోసం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ కలయికలో చేసిన ఈ సినిమా సెన్సేషన్ ని సెట్ చేసింది. అలాగే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చాక కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ దెబ్బ తోనే పవన్ నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా వారు తీసుకున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ని ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఆల్రెడీ సొంతం చేసుకున్నారు. కానీ ట్విస్ట్ గా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కే ఒకింత షాకింగ్ గా మారింది. దీనితో ఓజి ఎఫెక్ట్ తోనే మరింత ఆఫర్ ఇచ్చి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకొని ఉండొచ్చనే టాక్ ఇప్పుడు మొదలైంది. ఇక ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version