ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ప్రపంచ వ్యాప్తంగా హైప్ ని సొంతం చేసుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో చేస్తున్న ఒక ఎపిక్ చిత్రం “వారణాసి” అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ట్ పరిచయం కోసమే భారీ లెవెల్లో ప్లాన్ చేశారు. ఇక నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ బాకీ ఉన్నాయి. ఆల్రెడీ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అని ఖరారు చేశారు.
కానీ డేట్ ఏంటి అనేది అఫీషియల్ గా రివీల్ కాలేదు. మరి ఆ డేట్ ఏంటి అనేది ఎప్పుడు రివీల్ చేస్తారో అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ దీనిని అనౌన్స్ చేయనున్నారని వినిపిస్తుంది. సో ఈ ఏడాది మార్చ్ 26 న ఈ బిగ్ రివీల్ ఉండే అవకాశం ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే ప్రియాంక చోప్రాలు నటిస్తున్నారు.
