Dhandoraa OTT: ఒక్క ట్వీట్ లో మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చిన తారక్!

Dhandoraa

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చి మంచి టాక్ ను అందుకున్న చిత్రాల్లో శివాజీ, నవదీప్ అలాగే నందు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన కుల ఘర్షణ డ్రామా ‘దండోరా’ (Dhandoraa) కూడా ఒకటి. దర్శకుడు మురళికాంత్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ తర్వాత ఓటిటిలో విడుదల అయ్యింది.

ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఇటీవల అందుబాటులోకి వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. అయితే ఈ సినిమాకి ప్రశంసలు రాగ దీనిపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ తో మరింత బూస్టప్ వచ్చింది అని చెప్పాలి. తారక్ చేసిన లేటెస్ట్ ట్వీట్ ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో మరోసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది.

ఇది వరకే నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ సినిమా తర్వాత టాప్ 5 దిగువకు వెళ్ళింది. కానీ ఎప్పుడైతే తారక్ ఈ సినిమా కోసం పోస్ట్ చేసాడో మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇండియా వైడ్ గా టాప్ 2 లోకి వచ్చేసింది. దీనితో ఎన్టీఆర్ స్టార్ పవర్ తో ఈ సినిమాకి మరింత ఆదరణ అందింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో రవి కృష్ణ కూడా మంచి పాత్రలో నటించగా రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాణం వహించారు.

Exit mobile version