మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమాకు అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ కళ్లుచెదిరే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.
ఇక ఈ సినిమాకు వస్తున్ రెస్పాన్స్ చూసి సినీ ఎక్స్పర్ట్స్ సైతం అవాక్కవుతున్నారు. కాగా, ఈ సినిమాను సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జాయిన్ అయ్యాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు థియేటర్లలో సందడి చేయడం చాలా సంతోషంగా ఉంది.. వెంకీ గౌడ పాత్రలో వెంకీ మామ ఇరగదీశాడని.. నయనతార, కేథరిన్ థ్రెసా తమదైన పర్ఫార్మెన్స్లతో మెప్పించారని.. ప్రతి పాట వినసొంపుగా ఉందని.. ఇక అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీటు.. అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురపించారు.
ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L – I – T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
