‘విశ్వంభర’ కొత్త డేట్ లాక్? సమ్మర్ రిలీజ్ లేదా!?

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు తర్వాత భారీ విజువల్ ట్రీట్ తో తాను సిద్ధంగా ఉన్నారు. మరి ఆ చిత్రమే “విశ్వంభర” (Vishwambhara). దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ గ్రాండ్ ఫాంటసీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ కూడా ఈ ఏడాది వేసవిలోనే అని ఖరారు చేశారు. అయితే డేట్ ఎప్పుడు అనేది ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ రూమర్స్ గా మే 9 ఇలా పలు డేట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ ఫైనల్ డేట్ అంటూ ఒకటి వినిపిస్తుంది.

Vishwambhara on July 10 – జూలై 10న విశ్వంభర ఆగమనం?

ప్రస్తుతం అయితే విశ్వంభర (VIshwambhara) సినిమా వేసవి రేస్ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తుంది. దీనితో మేకర్స్ జూలై 10న ఈ సినిమా లాక్ చేశారట. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Baahunali date for Megastar – బాహుబలి 1 డేట్ లో మెగాస్టార్

తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని తేదీ జూలై 10. టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన బాహుబలి కూడా ఇదే జూలై 10న విడుదల అయ్యింది. మరి అలాంటి స్పెషల్ డేట్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తుండడం విశేషం. అలాగే బాహుబలి హీరో ప్రభాస్ ఫ్రెండ్స్ నిర్మాణ సంస్థ యూవీ వారు అదే బాహుబలి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కలయికలో విశ్వంభర వస్తుండడం మరో గమనించాల్సిన అంశం.

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్, సురభి పురాణిక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version