అలరించేందుకు రెడీ అయిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. టికెట్ రేట్లు ఎంతంటే..?

OM shanti

డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్, అందాల భామ ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలను ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఏఆర్ సజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి 30న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ రేట్లతో రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్ర టికెట్ రేటు రూ.99, మల్టీప్లెక్స్‌లో రూ.150/- గా ఫిక్స్ చేశారు. ప్రేక్షకులకు తక్కువ ధరలో తమ సినిమాను వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు జే క్రిష్ సంగీతం అందిస్తుండగా సృజన్ యరగోలు, ఆదిత్య పిట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Exit mobile version