టాలీవుడ్లో వరుసగా తొమ్మిది బ్లాక్బస్టర్లు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇస్తూ, మరో వారంలో అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నారు. ఇప్పటికే అనిల్ చెప్పిన వినోదాత్మక కథకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం, వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో హిలేరియస్ ఎంటర్టైనర్గా నిలవనుంది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సాహు గారపాటి, సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
