పిక్ టాక్ : ఇరుముడి సెట్స్‌లో మాస్ రాజా బర్త్ డే సెలబ్రేషన్స్

Irumudi

మాస్ రాజా రవితేజ రీసెంట్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి బరిలో దిగాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. జనవరి 26న పుట్టినరోజు జరుపుకుంటున్న రవితేజ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తన నెక్స్ట్ చిత్రానికి ‘ఇరుముడి’ (Irumudi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా సెట్స్‌లో రవితేజ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. రవితేజ కేక్ కట్ చేసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా డైలాగ్ కింగ్ సాయి కుమార్, బేబి నక్షత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version