సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంకా చోప్రా జోనస్ అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి దిగ్గజ స్టార్స్ తో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రమే ‘వారణాసి’ (Varanasi Movie). ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ని మేకర్స్ ఆల్రెడీ 2027 వేసవిలో అని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ డేట్ ఏంటి అనేది అధికారికంగా బయటికి రాలేదు. అనధికారికంగానే పలు డేట్స్ వినిపిస్తూ వస్తున్నాయి కానీ లేటెస్ట్ గా ఓ డేట్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Varanasi Release Date – 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ పరిచయం
మహేష్ బాబుతో రాజమౌళి ప్రాజెక్ట్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డ్రీం కలయిక. కానీ వీరి కలయికలో ఏకంగా ప్రపంచమే నివ్వెరపోయే సినిమా వస్తుందని బహుశా ఎవరూ ఊహించి కూడా ఉండకపోవచ్చు. మరి ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నట్టుగా డేట్ ఇప్పుడు లీక్ అయ్యి వైరల్ అయ్యింది.
వారణాసి నుంచే వారణాసి డేట్ బయటకి..
వారణాసి (Varanasi) అనేది ఎంతటి పవిత్ర స్థలం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అదే ప్రాంతం నుంచి ఇప్పుడు వారణాసి చిత్రం తాలూకా డేట్ ని హోర్డింగ్స్ గా పెట్టిన విజువల్స్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. దీనితో అసలు ఈ ఊహించని ప్లానింగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇలా వారణాసి డేట్ అందరిలో ఉత్సుకత నెలకొల్పింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మేకర్స్ ఇదే డేట్ లో సినిమాని తెస్తున్నారా లేదా అనేది ఒక ఆధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం.
