సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ అలాగే పృథ్వి రాజ్ సుకుమారన్ కలయికలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే వారణాసి (Varanasi). అయితే ఈ సినిమా అధికారిక అనౌన్స్మెంట్ రోజున ఎలాగైతే ప్రపంచ ఆడియెన్స్ లో బజ్ ని క్రియేట్ చేసుకుందో ఇప్పుడు కనీసం ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా ఆఫ్ లైన్ లో ఓ హోర్డింగ్ తో ఇంటర్నెట్ ని తగలబెట్టేశారు.
దీని రిజల్ట్.. మళ్లీ ప్రపంచ సినిమా దగ్గర వారణాసి పేరు వైరల్ గా మారింది. ఇలా కేవలం ఒక లీక్ లా అది నిజమా కాదా అనే సందేహం నుంచి ఏకంగా ప్రపంచ ప్రముఖ సినీ పోర్టల్స్ లో సైతం వారణాసి కోసమే మాట్లాడ్డం జరుగుతుంది. దీనితో జక్కన్న దెబ్బ మాత్రం వరల్డ్ సినిమా ఆడియెన్స్ దగ్గర నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే.
