టాలీవుడ్లో తెరకెక్కిన మ్యాడ్, మ్యాడ్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా, పూర్తి యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాల్లో నార్నె నవీన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించి మెప్పించారు.
అయితే, ఇప్పుడు ‘మ్యాడ్ 3’ (Mad 3) చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొత్త కాస్టింగ్‌లో భాగంగా ‘లిటిల్ హార్ట్స్’ ఫేం జేయ్ కృష్ణ, ‘కోర్ట్’ ఫేం హర్ష్ రోషన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని, త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
