నాని-సుజిత్ చిత్రంపై క్రేజీ బజ్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Nani Sujeeth

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

కాగా, ఈ సినిమా తర్వాత నాని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూన్ నెలలో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర నాని తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Exit mobile version