చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘బైకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో తొలి బైక్ రేసింగ్ కాన్సె్ప్ట్‌తో తెరకెక్కిన ఈ ‘బైకర్’ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
బైకర్ చిత్రంలో ‘బుల్లెట్ సునీల్’ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఫిబ్రవరి 4న ఉదయం 11.07 గంటలకు బుల్లెట్ సునీల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
కాగా ఈ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ‘బుల్లెట్ సునీల్’ పాత్రలో ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బైకర్ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ అప్డేట్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
