టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ‘వారణాసి’ (Varanasi) అనే ప్రెస్టీజియస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ కోసం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. రుద్ర అనే పాత్రలో మహేష్ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.
ఈ సినిమా కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాడట. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ‘వారణాసి’ (Varanasi) కోసం రాజమౌళి తన బాడీ లాంగ్వేజ్ మార్చాలని చెప్పాడని.. దీనికోసం 6 నెలల పాటు ప్రాక్టీస్ చేశానని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చానని.. అది ఈ సినిమాలో రెండు చోట్ల కనిపిస్తుందని మహేష్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ‘వారణాసి’ (Varanasi) కోసం మహేష్ ఎంత కష్టపడుతున్నాడో ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
