మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ (Peddi) కోసం మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘పెద్ది’ (Peddi) మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు. కానీ, చిత్ర షూటింగ్‌కు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఉండిపోవడంతో ఈ చిత్ర రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. లాంగ్ వీకెండ్ కలిసొస్తుండటంతో ఈ డేట్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని ‘పెద్ది’ (Peddi) మేకర్స్ భావిస్తున్నారు.
ఇక సమ్మర్ స్టోర్మ్‌ను ‘పెద్ది’ (Peddi) పట్టుకొస్తుండటంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి ర్యాంపేజ్ క్రియేట్ చేయబోతున్నాడా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
30-04-2026 💥#PEDDI
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
