పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab)భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయగా భారీ హైప్‌తో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ, సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఈ మూవీ ప్రభాస్ ఖాతాలో ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో ‘ది రాజాసాబ్’ చిత్రం ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, థియేటర్లలో ‘ది రాజాసాబ్’ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేసినట్లు మేకర్స్ గతంలో వెల్లడించారు. ఇప్పుడు ఆ సీన్స్ అన్ని కూడా ఓటీటీ స్ట్రీమింగ్ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లలో మిస్ అయిన సీన్స్‌ను ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
