టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela)తన అందంతో పాటు అభినయం, డ్యాన్స్ స్టెప్పులతో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అయితే, ఆమె ఇప్పుడు తన జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తాను చదువుకుంటున్న మెడిసిన్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి MBBS పట్టా అందుకుంది.
సినిమా షూటింగులు, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటి బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆమె డాక్టర్‌గా పట్టా పొందడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఆమె గ్రాడ్యుయేషన్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల డాక్టర్ పట్టా అందుకోవడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూ కూడా ఆమె డాక్టర్ పూర్తి చేయడం నిజంగా అభినందనీయం అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
