అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ పరిస్థితేంటి ?

Lenin

యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదట మే 1, 2026న విడుదల కావాల్సి ఉంది. ఐతే, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, నిర్మాతలు నిన్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విడుదల తేదీని పెట్టలేదు. రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30 విడుదల కావాల్సి ఉన్నందున, ఈ చిత్రం వాయిదా పడిందని తెలుస్తోంది.

అందుకే, పోస్టర్ లో విడుదల తేదీ పెట్టలేదు అని చెబుతున్నారు. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Exit mobile version