‘నాగబంధం’ టీజర్ ర్యాంపేజ్.. 24 గంటల్లోనే ఆ మార్క్ టచ్..!

naga

అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక పౌరాణిక గాథను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు అభిషేక్ నామా తన రెండో చిత్రంతోనే ఇంతటి భారీ సాహసం చేయడం విశేషం. నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విరాట్ కర్ణ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుని, శివ స్వరూపాన్ని తలపించేలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్‌లో చూపించిన గ్రాఫిక్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ మరియు నేపధ్య సంగీతం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version