తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ త్వరలోనే నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్, ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కనుంది.
ప్రముఖ షార్ట్ ఫిల్మ్ ‘మనసానమహ’తో ప్రశంసలు అందుకున్న దీపక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ధ్రువ్ విక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది.
చాలా కాలంగా తెలుగు మేకర్స్ ధ్రువ్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ చివరకు ఈ కాంబినేషన్ సెట్ చేయడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ధ్రువ్ విక్రమ్ తన తండ్రిలాగే టాలీవుడ్లో కూడా తనదైన ముద్ర వేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
