ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ‘కాపీరైట్’ ఝలక్..!

Ilayaraja

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ తో ఇళయరాజాకు కొనసాగుతున్న లీగల్ పోరులో ఢిల్లీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాను కంపోజ్ చేసిన పాటలపై తనకే కాపీరైట్స్ ఉంటాయని ఇళయరాజా గత కొంత కాలంగా కేసులు వేస్తూ వస్తున్నారు.

అయితే, ఈ వివాదంపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో రైట్స్ సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఆయా చిత్రాల నిర్మాతలు తమ హక్కులను సదరు సంస్థకు విక్రయించడంతో ఇప్పుడు వాటిపై సరిగమ సంస్థకే పూర్తి రైట్స్ ఉంటాయని కోర్టు తీర్పునిచ్చింది.

నిర్మాత దగ్గర రెమ్యునరేషన్ తీసుకుని సంగీతం అందించడంతో ఆ మ్యూజిక్ రైట్స్ ఇళయరాజాకు చెందవని.. వాటిపై పూర్తి హక్కు కేవలం నిర్మాతకు మాత్రమే ఉంటుందని కోర్టు వెల్లడించింది. మరి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ షాక్‌తో ఇళయరాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version