సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేగాక ‘రాముడి’ పాత్రలోనూ మహేష్ కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్‌పై ఉండగానే, మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. సందీప్ గతంలోనే మహేష్ కోసం ‘డెవిల్’ అనే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, అది ‘వారణాసి’ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ తర్వాత ప్లాపులు వస్తాయనే ఒక ‘సెంటిమెంట్’ ఇండస్ట్రీలో ఉంది. అయితే, సందీప్ రెడ్డి వంగా వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా చేస్తే మహేష్ ఆ సెంటిమెంట్‌ను ఈజీగా బ్రేక్ చేస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్స్ అయినప్పటికీ, ఒకవేళ ఈ కాంబో నిజమైతే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.
