పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నా కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). మాస్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ గా ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ ఇప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఈ ఫిబ్రవరి 22న సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఓ మాస్ ప్రోమోను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రోమో రేపే ఫిబ్రవరి 19న వస్తున్నట్టు ఇప్పుడు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసేసారు. మరి దీనిని దేవిశ్రీ ప్రసాద్ ఎలా ప్లాన్ చేసారో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు పార్తిబన్ విలన్ పాత్రలో నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
Lit by AURA not light 🔥🔥
Power Star @PawanKalyan and Cult Captain @harish2you from the song shoot 💥💥#UstaadBhagatSingh second single #AuraOfUstaad out on February 22nd ❤🔥
Promo out tomorrow 💥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.… pic.twitter.com/HVCzWwlCmZ
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 18, 2026
