అట్లీ, ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ లో ఊహించని ఎపిసోడ్ ట్రాక్స్ కూడానా?

alluarjun-atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసిన పుష్ప 2 తర్వాత కోలీవుడ్ 1000 కోట్ల దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ లెవెల్ సినిమా ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ యాక్షన్ తో ఫిల్ చేసి ఉంటాయని తెలిసిందే.

కానీ ఇంకో క్రేజీ రూమర్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాలో సాలిడ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. అట్లీ ఏకంగా కొన్ని సెపరేట్ కామెడీ ట్రాక్ లనే మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల సాయంతో చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది వినేందుకు కొంచెం రియాలిటీకి దూరంగానే ఉన్నా ఈ పనులు కూడా జరుగుతున్నట్టే టాక్.

అట్లీ కొన్ని సినిమాల్లో మంచి ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వాటిని మళ్ళీ ఇందులో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడో ఏమో కానీ వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version