‘బైకర్’ తెలుగు రాష్ట్రాల రైట్స్.. ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న దిల్ రాజు..!

Biker

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తుండగా తొలి తెలుగు రేసింగ్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను పెంచాయి.

అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు. నైజాం, ఏపీ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్‌ను ఆయన సుమారు రూ.20 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. ఈ సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ మరో బలంగా మారడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version