‘ధురంధర్ 2’ సెన్సార్ ట్విస్ట్.. షాకింగ్ రన్ టైం, మరో బిగ్ ఛేంజ్?

Dhurandhar 2

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ధురంధర్” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న ధురంధర్ 2 పట్ల కూడా మంచి హైప్ ఇపుడు నెలకొంది. అయితే ఈ చిత్రం సెన్సార్ కి సంబంధించి కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

పార్ట్ 1 ని మేకర్స్ ఏకంగా మూడున్నర గంటల పాటు కట్ చేస్తే పార్ట్ 2 ని కూడా ఇదే రీతిలో భారీ రన్ టైం తోనే సెట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గత భాగం కంటే ఒక పది నిమిషాలు తక్కువే ఈసారి ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా పార్ట్ 1 కి సెన్సార్ యూనిట్ కేవలం పెద్దలు మాత్రమే చూసే సినిమాగా ఏ రేటెడ్ సర్టిఫికెట్ అందించారు.

కానీ ఈసారి బిగ్ ఛేంజ్ ఏంటంటే పార్ట్ 2 కి మాత్రం యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈసారి ధురంధర్ కి ఇది ఎఫెక్ట్ అవుతుందా లేక ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. మేకర్స్ పార్ట్ 2 ను గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా తెలుగు వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Exit mobile version