మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నయనికా రెడ్డితో మార్చి 6న ఆయన వివాహం జరగనుంది. ఇప్పటికే దుబాయ్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరైన చరణ్, అల్లు కుటుంబంతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, రామ్ చరణ్-ఉపాసన జంటలు నూతన వధూవరులతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మెగా-అల్లు హీరోలు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఒక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. మరోవైపు, రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.
