నటి వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా.. వివిధ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఐతే, తాజాగా ఆమె మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ అవతారమెత్తి.. ‘సరస్వతి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘సరస్వతి’ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను హీరో నాని విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ”ఒక మంచి సినిమా తీశాం. ఇన్ని రోజులు ఇక్కడ నేను బ్రతుకుతున్నాను అంటే ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఇప్పుడు డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నాను. ఒక స్ట్రాంగ్ కంటెంట్ తో తీసిన ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ట్రైలర్ లో చూపించినట్లుగా ఇది ప్రాపర్ థ్రిల్లర్ మూవీ. నేను మహిళల హక్కుల కోసం నిలబడతానని మీ అందరికీ తెలుసు. ఇక గోపీచంద్ మలినేని నాకు ఫ్రెండ్, గురువు, ఒక మెంటర్. నా లైఫ్ ని తెలుగు సినిమాలోకి రీలాంచ్ చేశారు. ఆయన వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోను. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ సార్. నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు” అంటూ వరలక్ష్మి కన్నీళ్లు తెలిపారు.
